ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర కీలకం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:32 AM
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర కీలకమైనదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంప ల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర కీలకమైనదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంప ల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ముస్కానిపేటలో బీఎల్‌ఓలు చేస్తున్న సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఇంటికి వచ్చే బీఎల్‌ఓలకు సమాచారం అందివ్వా లని సూచించారు. ఖచ్చితమైన ఓటర్ జాబితా ద్వారానే అర్హులైన వారిని ఎంపిక చేసుకొనే వీలు కలుగుతుందన్నారు. ప్రతి ఓట రు తమకు ఇచ్చిన ఎన్యూమరేషన్ దరఖాస్తును పూరించా లని, అవసరమైతే సహాయం తీసుకోవాలన్నారు. అర్హులైన వారి ఓటరును జాబితాలో చేర్చాలని సూచించారు. కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ మామిడి రాజు, నాయిని నవీన్ కుమార్, నేరెళ్ళ విజ య్‌కుమార్, చల్ల నవీన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్ ప్రసాద్, నాయకులు మహేందర్‌రెడ్డి, ఆనందరెడ్డి, ఎలుక రామస్వామి, చిట్టి ప్రదీప్ రెడ్డి, జమాల్, స్వామిలతో పాటు పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పనుల పరిశీలన..
మండల కేంద్రంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ సుం దరీకరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తయితే ఈ ప్రాంతానికి మంచి కళ వస్తుందన్నారు. ప్రతి ఒక్కరు సహకరించడం ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. అనంతరం ఇల్లంతకుం టలో అవారి బాలయ్య, ఉస్మాన్, పత్తికుంటపల్లె గ్రామాల్లో బాధితుల ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.