Share News

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:19 AM

జిల్లాలో శాంతి భదత్రల పరిరక్షణలో సివిల్‌ పోలీసులతో పాటు అర్ముడ్‌ రిజర్వ్‌డ్‌ పోలీసుల విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోందని ఎస్పీ మహేష్‌బీగీతే అన్నా రు.

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం

సిరిసిల్ల అర్బన్‌, మార్చి11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శాంతి భదత్రల పరిరక్షణలో సివిల్‌ పోలీసులతో పాటు అర్ముడ్‌ రిజర్వ్‌డ్‌ పోలీసుల విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోందని ఎస్పీ మహేష్‌బీగీతే అన్నా రు. సాయుధ దళాల వార్షి క పునర్‌ ఉచ్చరణ ముగిం పు కార్యక్రమంలో భాగంగా బుధవారం సిరిసిల్ల పోలీస్‌ కార్యాలయంలో పరేడ్‌ మైదా నంలో నిర్వహించిన సాయుధ దళాల సమీకరణ కవాతు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వంద నాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్‌ పోలీస్‌లతోపాటు అర్ముడ్‌ రిజ్వర్‌ విభాగం కూడా ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తోందని అదే ఉత్సాహంతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోనడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పిలుపుని చ్చారు. వార్షిక మోబిలైజేషన్‌ శిక్షణలో భాగంగా పోలీస్‌ అధికారులకు సిబ్బందికి అర్మ్సుడ్రిల్‌, లాఠీడ్రిల్‌, పుట్‌డ్రిల్‌, సెర్మొనియల్‌ డ్రిల్‌, గార్గ్‌ మౌంటింగ్‌, మాబ్‌ అపరేషన్‌ ఫైరింగ్‌ నాకబందీ, పికెట్స్‌, వీఐపీ బందోబస్తు విధులు, ప్రిజనర్‌ క్యాష్‌ ఎస్కార్ట్‌ వంటి అంశాలపై శిక్షణ అందిం చినట్లు తెలిపారు. పోలీస్‌ ఉద్యోగం ఎంతో బాధ్యతాయు తమైనదని, మారుతున్న పరిస్థితుల నేపఽథ్యంలో పోలీసు లు తమ వృత్తి నైపుణ్యాలను మార్చిపోకుండా ఎప్పటి కప్పుడు గుర్తు చేసుకుంటూ శారీరక దారుడ్యం కాపాడు కోవాలని సూచించారు. ఇందుకు మిబిలైజేషన్‌ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరంతరం విధులల్లో నిమగ్నమై ఉండే పోలీస్‌ అధికారులు, సిబ్బందికి వ్యక్తిగ త కుటుంబపరమైన శాఖపరమైన సమస్యలను పరిష్క రించేందుకు ఎల్లప్పుడు ముందుంటామన్నారు. అంతకు ముందు వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు సిబ్బందికి సర్ధాపూర్‌ పోలీస్‌ బెటాలియన్‌ లోని ఫైరింగ్‌ రేంజ్‌లో ఇచ్చే ఫైరింగ్‌ శిక్షణను ఎస్పీ పర్య వేక్షించి ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఫైరింగ్‌లో ఉత్తమ ప్రతి భకనబర్చిన వారిలో మొదటి స్థానంలో శ్రీనివాస్‌, ద్వితీ య స్థానంలో వెంకటేష్‌, తృతీయ స్థానంలో ప్రియంక, రాత పరీక్షల్లో మొదటి స్థానం మనోజ్‌కుమార్‌, ద్వితీయ స్థానం శ్రీనివాస్‌, తృతీయ స్థానంలో ప్రియాంక నిలువ గా వీరికి ప్రశ్నంసా పత్రాలను అందించి అభినందించా రు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐ లు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:19 AM