మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకం
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:28 AM
స్వేచ్ఛగా, నిష్పక్ష పాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకమని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : స్వేచ్ఛగా, నిష్పక్ష పాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకమని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మం దిరంలో శుక్రవారం మైక్రో అబ్జర్వర్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణకు మున్సి పల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీని వాస్‌రెడ్డితో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ హాజరై మాట్లాడారు. మైక్రోఅబ్జర్వర్‌లు పో లింగ్‌కు ముందురోజు పోలింగ్ కేంద్రాలను నిశి తంగా పరిశీలించాలని ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి అట్టి నివేదికలను ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమర్పించాల న్నారు. మైక్రో అబ్జర్వర్‌లకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలల్లోని సరిళిని ప్రతి అంశాన్నినిఽశితంగా పరిశీలించాలని వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తూనే పోలింగ్ టీంలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందో లేదా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్ని కల నియమావళి అమలు తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీ లించాలని అదేశించారు. ఎవరైనా నిబందనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి మల్లికార్జున్‌రావు, ట్రైనర్ మహేంద ర్‌రెడ్డి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.