ఎన్నికల సమయంలో బూత్ కమిటీ అధ్యక్షుల పాత్ర కీలకం
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:18 AM
సిరిసిల్ల పట్టణ ప్రజలకు బీఆర్ ఎస్ పార్టీపై బలమైన నమ్మకం ఉండడం వల్లే విజయం సాధించామని, ఎన్నికల సమయంలో బూత్ కమిటీ అధ్యక్షుల పాత్ర కీలకమైందని బీఆర్ ఎస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణ ప్రజలకు బీఆర్ ఎస్ పార్టీపై బలమైన నమ్మకం ఉండడం వల్లే విజయం సాధించామని, ఎన్నికల సమయంలో బూత్ కమిటీ అధ్యక్షుల పాత్ర కీలకమైందని బీఆర్ ఎస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 6, 21, 25, 32, 36 వార్డులో బీఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్ ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశాలను నిర్వ హించగా తుల ఉమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వార్డుల్లో జరిగిన సమావేశాల్లో తుల ఉమతో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశాలలో తుల ఉమ మా ట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ అధ్యక్షులను ఏర్పాటుచేసుకోవాల్సి ఉం దని బూత్‌కు ఇద్దరు చొప్పున పేర్లను ఇవ్వాలన్నారు. బూత్ అధ్యక్షులు చాలా కీలకమని, ఓటరు లిస్టు వచ్చినప్పుడు దొంగ ఓట్లను తేలికగా గుర్తిం చడానికి బూత్ అధ్యక్షులు ఉంటారన్నారు. బూత్‌లో ఓటర్లందరిపై బూత్ అధ్యక్షులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పార్టీ పక్షాన కూడా బూత్ అధ్యక్షులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బూత్ లో ఓటర్ల సమాచారంపై ఈనెల 13న నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో సమావేశం ఉంటుందన్నారు. ఆరోజు మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని సూచించారు. సిరిసిల్ల పట్ట ణంలో మొదటి నుంచి కూడా బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందని కేటీఆర్‌ను అనేక దఫాలుగా పట్టణ ప్రజలు గెలిపించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్న ప్రజలకు ఏం చేసిందో తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావే శంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్య క్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి రవి, కౌన్సిలర్లు దూడం రజని, ఎలుక వెంకటేశం, బింగి రాంబాబు, కల్లూరి రేణుక, బీఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రాజు, ఎర్రం మల్లయ్య, సయ్యద్ అక్రమ్, వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.