Share News

ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:08 AM

ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్రం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం

వేములవాడ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్రం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడ పట్టణం లోని మహాలింగేశ్వర గార్డెన్‌లో శుక్రవారం పట్టణం, రూరల్‌ మండల బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో ప్రత్యేక ఓటరు జాబిత సవరణ సర్‌పై అవఆహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరైన ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో పేరు నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగించడం, మార్పులు, చేర్పులు, సవరణలు చట్టబద్దంగా జరిగేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగహన కల్పించాలని, అవసరమైన పత్రా లను సేకరించి దరఖాస్తులను సక్రమంగా పూర్తి చేయించాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు పేరు బీఎల్‌వోల వద్ద వున్న ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీ లించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యతగా గ్రామాల్లో ప్రజలకు ఓటరు జాబితాపై అవగహన కల్పిం చాలని తెలిపారు. ఎన్నికల సంఘం అను మానస్పద, పరిశీలన జాబితాలో చేర్చిన ఓట్లకు సంబంధించి ఆయా ఓటర్లకు బీఎల్‌ ఏలు సమాచారం అందించాలని అన్నారు. ఓటరు జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే, సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు సమర్పించేలా ప్రజలకు మార్గ నిర్ధేశం చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో చేస్తు న్న అభివృద్దిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ పార్టీ అసత్యపు ఆరో పణలు చేస్తు న్నారని తెలి పారు. అను నిత్యం అసత్య పు ఆరోపణలు చేస్తూ ప్రజ లను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్న వారిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండ గట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూమ్‌ మధు నాయకులు కాశ శ్రీనివాస్‌, సంద్రగిరి శ్రీనివాస్‌, రంగు వెంకటేశం, సోయి నేని కరుణాకర్‌, నాగుల విష్ణు, కూరగాయాల కొమురయ్య, చిలుక రమేష్‌, సాగరం వెంకట స్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:09 AM