ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:46 AM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్‌లు అన్నారు.
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్‌లు అన్నారు. పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి వారు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక వివేకానంద స్టేడియం నుంచి స్థానిక ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో హకీం, జిల్లా క్రీడల అధికారి రవికుమార్, ఆర్టీవో మధుసూధన్ గౌడ్, అర్బన్. రూరల్ మండల తహసీల్దార్‌లు రాంమోహన్‌రావు, వరంధన్, మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, సామాజిక సేవకుడు రాజగోపాలాచారి, విద్యార్థులు, ఉద్యోగులు, యువత పాల్గొన్నారు. ఓటుహక్కును వినియోగించు కుంటున్న సీనియర్ సిటిజన్లను సత్కరించారు.