Share News

రిజర్వేషన్ల లెక్క తేలింది..

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:30 AM

బల్దియా ఎన్నికల్లో ముఖ్యమైన ఘట్టం ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, గుర్తులు, చైర్‌పర్స న్‌, వార్డుల రిజర్వేషన్లు ప్రక్రియ ముగిసింది.

రిజర్వేషన్ల లెక్క తేలింది..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

బల్దియా ఎన్నికల్లో ముఖ్యమైన ఘట్టం ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, గుర్తులు, చైర్‌పర్స న్‌, వార్డుల రిజర్వేషన్లు ప్రక్రియ ముగిసింది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికే షన్‌ రానున్న నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో కోలాహలం మొదలైంది. శనివా రం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో చైర్మ న్‌ వార్డు రిజర్వేషన్లకు తెరపడింది. రాష్ట్ర యూని ట్‌గా సిరిసిల్ల చైర్‌పర్సన్‌ స్థానం మళ్లీ మహిళల కు అవకాశం దక్కింది. ఈసారి జనరల్‌ మహిళ కు కేటాయించారు. వేములవాడ చైర్‌పర్సన్‌ స్థానం మాత్రం మార్పు చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో బీసీ మహిళకు అవకాశం రాగా ఈసా రి బీసీ జనరల్‌గా రిజర్వుడు చేశారు. బీసీ డెడికే టెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని 67 వార్డులకు కేటాయించిన రిజర్వేషన్లను శనివారం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఖరారు చేశారు. డ్రా పద్ధతిలో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన లెక్కల ప్రకారం బీసీ 24 వార్డులు, జనరల్‌ 34 వార్డులు, ఎస్సీ 7, ఎస్టీ రెండు వార్డులను కేటాయించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా ఎస్టీ జన రల్‌ ఒకటి, ఎస్సీలకు మూడు స్థానాలు కేటా యించగా రెండు జనరల్‌, ఒకటి మహిళా, బీసీ లకు 15 స్థానాలు కేటాయించగా 8 జనరల్‌, 4 మహిళలకు, జనరల్‌కు 15స్థానాలు కేటాయించ గా 9జనరల్‌, 11 మహిళలకు రిజర్వ్‌ చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో 28వార్డులు ఉండ గా ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీలకు నాలుగు కేటా యించగా రెండు జనరల్‌, రెండు మహిళలకు, బీసీలకు 9స్థానాల్లో కేటాయించగా జనరల్‌ ఐదు, మహిళకు నాలుగు స్థానాలు, జనరల్‌ స్థానాలు 14 ఉండగా ఆరు జనరల్‌, 8 మహిళలకు కేటా యించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశా వహుల్లో దూకుడు పెరిగింది. తమకు అనుకూ లంగా ఉన్న వార్డుల్లో పోటీకి సన్నాహాలు మొద లుపెట్టారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్య ర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. మరోవైపు పోటీకి సిద్ధమైన ఆశావహులు టికెట్లకోసం పార్టీ నేతల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు.

ఎవరు ఎక్కడ..

సిరిసిల్ల మున్సిపాలిటీ లో 39 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీలకు 3, బీసీలకు 15, జనరల్‌ 20 రిజర్వ్‌చేస్తూ ప్రభు త్వం కోటా నిర్ణయించగా దాని ప్రకారం12వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. మూడు ఎస్సీ రిజర్వ్‌ కోటాలో1వ వార్డు, 22వ వార్డు ఎస్సీ జనరల్‌ కు, 8వ వారు ్డమహిళకు, బీసీలకు 15వార్డులు రిజర్వ్‌ కాగా బీసీ మహిళలకు 3,4,5,10,31, 38, 39 వార్డులు, బీసీ జనరల్‌ వార్డుల్లో 2,7,11,13,14, 16, 17, 20, వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ వార్డుల్లో జనరల్‌ మహిళ రిజర్వ్‌లో 6,9, 15,18, 23,27,28,29,30,36,37, వార్డులు, జనరల్‌వార్డుల్లో 19, 21, 24,25,26, 32,33,34, 35, కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28వార్డులు ఉండ గా ఎస్టీ జనరల్‌గా 12వ వార్డు, ఎస్సీ రిజర్వేషన్‌ లో ఎస్సీ మహిళకు 3,13, ఎస్సీ జనరల్‌గా 17, 20, బీసీల రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 1,11, 23,27, బీసీ జనరల్‌గా 8,15,16,21,24 వార్డులు రిజర్వ్‌అయ్యాయి.జనరల్‌కోటాలో జనరల్‌ మహి ళలకు 2,5,9,10,19,22, 26, 28 వార్డులు, జనరల్‌ గా 4,6,7,14,18,25 వార్డులు కేటాయించారు.

Updated Date - Jan 18 , 2026 | 12:30 AM