సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత చాటాలి
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:06 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఖ్యాతిని మరింత చాటాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఖ్యాతిని మరింత చాటాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినో త్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల అర్బన్ పరిధి చంద్రంపేటలోని వెల్ది హరిప్ర సాద్ ఇంటికి శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెళ్లారు. హరిప్రసాద్ దంపతు లను అభినందించి సన్మానించారు. హరిప్రసాద్ మగ్గంపై పీతాంబరం, అగ్గిపెట్టె లో చీరలను తయారుచేసి సిద్ధంగా పెట్టగా కలెక్టర్ పరిశీలించారు. తయారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మరిన్ని నూతన ఆవిష్కరణలు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి మరింత చాటాలని కోరారు. కార్యక్రమంలో చేనేత జౌళీశాఖ ఏడీ సంతోష్, తహసీల్ధార్ మహేష్‌కుమార్‌రావులు ఉన్నారు.