Share News

ఆర్టీవో కార్యాలయంలో దళారుల దందా

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:45 AM

పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయంలో ప్రతీ పనికీ ఓ రేటు చెల్లిస్తేనే పని జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్టీవో కార్యాలయంలో దళారుల దందా
పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం

- లైసెన్స్‌ నుంచి ఫిట్‌నెస్‌ వరకు అదనపు వసూళ్లు

- విచారణ జరపాలంటున్న వాహనదారులు

పెద్దపల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయంలో ప్రతీ పనికీ ఓ రేటు చెల్లిస్తేనే పని జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌.. రెన్యూవల్‌.. నూతన వాహనం రిజిస్ట్రేషన్‌.. పాత వాహనానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలన్నా.. పర్మిట్‌ కావాలన్నా మధ్యవర్తుల ప్రమేయం తప్పడం లేదని పలువురు వాహనదారులు వాపోతున్నారు.

ఫ ఆన్‌లైన్‌ ఉన్నా.. దళారులే దిక్కు!

ప్రభుత్వం పాలనలో పారదర్శకత పెంచేందుకు రవాణా శాఖ సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, దరఖాస్తు స్థితిని తెలుసుకోవడం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఆర్టీవో కార్యాలయంలో దళారుల వ్యవస్థ కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌ విధానంపై అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకుని మధ్యవర్తులు రంగంలోకి దిగుతున్నారని వాహనదారులు చెబుతున్నారు. దర ఖాస్తు నుంచి పని పూర్తయ్యే వరకు తామే చూసుకుంటామని అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారు.

ఫ ప్రతి పనికీ రేటు?

డ్రైవింగ్‌ లైసెన్స్‌, లైసెన్స్‌ రెన్యువల్‌, డూప్లికేట్‌ లైసెన్స్‌, చిరునామా మార్పు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌, ఆర్‌సీ బదిలీ, డూప్లికేట్‌ ఆర్‌సీ.. ఇలా ప్రతి సేవకు ప్రభుత్వ ఫీజు నిర్ణయించింది. అయితే పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారిలో కొందరికి అధికారిక ఫీజుతోపాటు ఏజెంట్‌ చార్జీ పేరుతో అదనంగా చెల్లిం చాల్సిన పరిస్థితి ఎదురవుతోందనే ఫిర్యాదులున్నాయి.

ఫ ఫిట్‌నెస్‌.. పర్మిట్లలోనూ ఇదే తీరు?

బస్సులు, లారీలు, గూడ్సు వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు తదితర వాహనాలకు నిర్దేశిత వ్యవధిలో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలి. వాహనం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించి ధ్రువీకరించాలి. అయితే ఈ ప్రక్రియలోనూ మధ్యవర్తుల ప్రమేయం ఉంటేనే పనులు అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. వాహనం పరీక్షకు తీసుకెళ్లే ముందే ఏజెంట్లను సంప్రదించాల్సి వస్తోందని కొందరు యజమానులు చెబుతున్నారు. పర్మిట్ల జారీ, రెన్యువల్‌, వాహనాల యాజమాన్య మార్పిడి వంటి పనుల్లోనూ ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫ అధికారులకు సహాయకులుగా బ్రోకర్లు?

దరఖాస్తుదారులకు మార్గనిర్దేశం చేసే స్థానంలో కొందరు మధ్యవర్తులే ముందుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ కౌం టర్‌కు వెళ్లాలి? ఎవరిని కలవాలి? పని ఎప్పుడు పూర్తవుతుంది? వంటి వివరాలను బ్రోకర్లే చెబుతున్నారని వాహనదారులు పేర్కొం టున్నారు. కొన్నిసార్లు అధికారిక ప్రక్రియ కంటే మధ్యవర్తుల ద్వారా వెళ్లడమే సులభమనే అభిప్రాయం ఉందని అంటున్నారు.

ఫ ’కోడింగ్‌‘ వ్యవహారంపై ఆరా తీయాలి

దరఖాస్తుల గుర్తింపు, వాటి పురోగతి, పని ఏ దశలో ఉందన్న విషయాలకు సంబంధించి కొందరు మధ్యవర్తులు ప్రత్యేక సంకేతాలు, స్లిప్పులు లేదా కోడింగ్‌ విధానాన్ని ఉపయోగిస్తు న్నారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.

Updated Date - Nov 21 , 2026 | 12:45 AM