Share News

కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లుకు తరలించాలి

ABN , Publish Date - May 10 , 2026 | 12:04 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యంను వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులతోపాటు నిర్వాహకులను ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లుకు తరలించాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యంను వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులతోపాటు నిర్వాహకులను ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడు గ్రామ శివారులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించారు. ఈ సంద ర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం కల్పించిన సౌకర్యాలు, దిగుబడి వివరాలు హమాలీల గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగో లు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కల్పించామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన వెంటనే జాప్యం చేయకుండా తూకం వేయాలని, అందుకు సరిపడా హమాలీలు అందుబా టులో ఉండేలా చూసుకోవాలన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల నేప థ్యంలో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో పెట్టు కోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు, ఎంత వరకు ఆన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ పూర్తయింది అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రా ల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేకుం డా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలిం చే అవకాశం ఉందని, జాప్యం చేయకుండా తరలించాలని, మిల్లుల్లో ధాన్యం బస్తాలు త్వరగా అన్‌లోడ్‌ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని అధికా రులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, సహ కార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌అలీబేగ్‌, తహ సీల్దార్‌ జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 12:04 AM