Share News

బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:36 PM

బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు.

బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వ హించిన గ్రీవెన్స్‌ డేకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి 17 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఫిర్యాదుల ఆధారంగా ఆయా మండలాల ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లా డి బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిం చి వారికి సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్‌బీగీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చే యడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్క రించే విధంగా కృషి చేస్తున్నామని, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిం చి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసర మైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్‌ శాఖపై భరో సా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధి కారుల దృష్టికి తీసుకురావడం ద్వారా త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 11:36 PM