Share News

స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:08 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లతోపాటు స్కావెంజర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్‌, స్కావెంజర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ మీసం లక్ష్మణ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లతోపాటు స్కావెంజర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్‌, స్కావెంజర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ మీసం లక్ష్మణ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక ్టరేట్‌ ఎదుట గురువారం ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్‌, స్కావెంజర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న స్వీపర్‌లు, స్కావెంజర్‌లు తరలివచ్చి ధర్నా చేపట్టి కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మీసం లక్ష్మణ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆదర్శ కమిటీల ద్వారా నియమించిన స్కావెంజర్‌లకు గత సంవత్సరం నాలుగు నెలల 15 రోజుల వేతనాలతో పాటు ఈ సంవత్సరం నాలుగు నెలల వేతనాలను వారి ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు పరిసరాలను శుభ్రం చేస్తున్న స్వీపర్‌లు, స్కావెంజర్‌లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేయాలని అన్నారు. వారి వేతనాల నుంచి ఉపాధ్యాయులు పాఠశాల మెయింటనెన్స్‌ పేరుతో వాలంటరీ టీచర్‌లకు జీతాలు అని వారి వేతనాల నుంచి కోత విధింస్తున్నారని అన్నారు. దీనిపై పలుమార్లు కలెక్టర్‌కు వినతి పత్రాలు అందించినా ఎలాంటి స్పం దన లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరికి ఇన్సూరెన్స్‌ కల్పించడంతోపాటు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ కింద రూ 4లక్షలు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోగా వారికి వేతనాలు చెల్లించాలని, వీరిని 4వ తరగతి ఉద్యోగు లుగా గుర్తించి సంవత్సరానికి 10 నెలలు కాకుండా 12 నెలలకు వేతనా లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్‌ బోడ్డు నర్సవ్వ, రమేష్‌, అంజనేయులు, స్వప్న, హరీష, కనకవ్వ, వరలక్ష్మీ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:08 AM