పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:38 AM
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో కళాభారతి నుంచి కలెక్టరేట్ వరకు గ్రామ పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులకు రెండు నెలల బకాయిలు జీతాలు చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు లేని కార్మికుల పేర్లు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్, రుద్రారపు నాంపల్లి, గాజర్ల రాజు, అలిశెట్టి రామానుజం, మహంకాలి కొమురయ్య, ఆకునూరి సుధాకర్,మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.