Share News

ఒగ్గు పూజారుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:40 AM

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదవ ఒగ్గు పూజారులు కరీంనగర్‌లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

ఒగ్గు పూజారుల సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదవ ఒగ్గు పూజారులు కరీంనగర్‌లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్‌ నుంచి కళాభారతి వరకు సాగిన ఈ ర్యాలీని యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి యాదవ ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల్వ మనోజ్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ.. అర్హులైన ఒగ్గు కళాకారులకు నెలకు ఐదు వేల పెన్షన్‌ అందించాలని, ఆరోగ్య భద్రత కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో యాదవ ఒగ్గు కళాకారుల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రి వేళల్లో విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న పోలీసుల వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావటి భూమయ్య యాదవ్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డేగ రమేష్‌యాదవ్‌, మేకల రాములుయాదవ్‌, సందెవేణి మహేంద్రనాథ్‌యాదవ్‌, కొండ రవి యాదవ్‌, మంచాల రవీందర్‌యాదవ్‌, రాజమల్లయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:40 AM