నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:41 AM
నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదైందని, దీన్ని ఆసరా చేసుకొని దళారులు నిత్యావసర వస్తువులను బ్లాక్ చేస్తున్నారన్నారు. అయినా వ్యాపారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా కరువు ఏర్పడితే ప్రజలకు మూడు నాలుగేళ్ల వరకు ఎఫ్‌సీఐతో ఆహా ర ధాన్యాలను నిలువచేసి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎల్‌నినో ప్రభావం ఏర్ప డి రెండు నెలలు కూడా కాలేదని, అప్పుడే ధాన్యం కొరత వచ్చిందన్నారు. మార్కె ట్లో కృత్రిమ కొరత సృష్టించి పేద, మధ్య తరగతి ప్రజల సొమ్మును కాజేస్తున్న వ్యాపారులతోపాటు దళారులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కోడం రమణ, సభ్యులు సూరం పద్మ, రమేష్ చంద్ర, పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, నాయకులు మిట్టపల్లి రాజమల్లు, సిరిమల్ల సత్యం, ఉడుత రవి, గోవిందు లక్ష్మణ్ పాల్గొన్నారు.