నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:52 PM
పెరుగుతు న్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రభుత్వమే రేషన్ దుకాణాల్లో 14రకాల నిత్యావసర సరుకులను అందిం చాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : పెరుగుతు న్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రభుత్వమే రేషన్ దుకాణాల్లో 14రకాల నిత్యావసర సరుకులను అందిం చాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌నకు ముఖ్యఅతిథి గా హాజరైన మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయ న్నారు. దీనిని ఆసరా చేసుకుని దళారులు పెద్ద మొత్తంలో నిత్యావసర సరుకులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించుకుంటున్నారని అన్నారు. రెండు మాసాల క్రితం ఉన్నటువంటి బియ్యం ధర క్వింటా లుకు రెట్టింపు పెరగడంతో కార్మికులు, మధ్య తరగతి ప్రజలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. కార్మికుల వేతనాలు రోజరోజుకు దిగాజారిపోతుంటే నిత్యావసర సరుకుల ధరలు అకాశానికి అంటుకుం టున్నాయని అన్నారు. ప్రభుత్వం ముందుస్తు చర్య లు తీసుకోకుండా ధరలను నియంత్రణను అరికట్ట కుండా దళారీలకు అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు సరు కులను తరలిస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ దుకాణాలలోనే 14 రకాల వస్తువులను ప్రజలకు అం దించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి విమల, జిల్లా అధ్యక్షురాలు అడెపు రజిత, సీఐటీయూ నాయకురాలు సూరం పద్మ, గట్ల స్వప్న, లలిత, మాధవి తది తరులు పాల్గొన్నారు.