Share News

ఆసుపత్రిలో ధరల పట్టికను ప్రదర్శించాలి

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:15 AM

జిల్లాలోని ప్రైవేటు ఆసుప త్రుల డాక్టర్లు, యజమానులు తప్పకుండా ధరల పట్టికను ప్రదర్శించా లని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఏంజెలా ఆల్ర్ఫెడ్‌ హెచ్చరించారు.

ఆసుపత్రిలో ధరల పట్టికను ప్రదర్శించాలి

వేములవాడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రైవేటు ఆసుప త్రుల డాక్టర్లు, యజమానులు తప్పకుండా ధరల పట్టికను ప్రదర్శించా లని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఏంజెలా ఆల్ర్ఫెడ్‌ హెచ్చరించారు. వేములవాడ పట్ట ణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ స్నానింగ్‌ సెంటర్లను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లా డుతూ ఆసుపత్రుల్లో వైద్యులు అందించే సేవలకు తీసుకునే రుసుము ల పట్టికను అందరికి తెలిసే విధంగా ప్రదర్శించాలని అంతే కాకుండా ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, యజమాన్యాలు విధిగా ధరల పట్టికను ప్రదర్శిచాలని ఆదేశిం చారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న రెండు డయాగ్న స్టిక్‌ సెంటర్‌లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆమె వెంట సెక్షన్‌ ఇంచార్జి మహేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:15 AM