Share News

వెంటనే పీఆర్సీని ప్రకటించాలి

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:28 AM

ప్రభుత్వ వెంటనే పీఆర్సీని ప్రకటించాలని పెండింగ్‌లో ఉన్న డీఏలను విడదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి సత్యానంద్‌ డిమాండ్‌ చేశారు.

వెంటనే పీఆర్సీని ప్రకటించాలి
మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి సత్యానంద్‌

- టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి సత్యానంద్‌

సిరిసిల్ల టౌన, జూన 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వెంటనే పీఆర్సీని ప్రకటించాలని పెండింగ్‌లో ఉన్న డీఏలను విడదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి సత్యానంద్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని గీతనగర్‌ జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు అధ్యక్షతన జిల్లా కమిటి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి సత్యానంద్‌ మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్‌సీ నివేదికను తెప్పించుకొని ఫిట్మెంట్‌ను ప్రకటించాలని పెండింగ్‌ డీఏలను విడదల చేయాలని, పాఠశాలల కుదింపును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని, ఉపాధ్యాయ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆదే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఎంఈవో, డిప్యూటీ ఎంఈవో పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తి చేయాలని, గురుకుల, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు చాలా సంవత్సరాలుగా పేరుకుపోయాయని తక్షణం ప్రభుత్వ పరిష్కరించాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్‌ మాట్లాడుతూ ఇనసర్వీస్‌ టీచర్స్‌కి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టెట్‌ని నిర్వహించి అర్హత మార్కులను కుదించాలని అన్నారు. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన విధానంను అమలు చేయాలని ఆగస్టు నెలలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీసీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్‌ టైమ్‌ టేబుల్‌ మార్చాలని అదే విధంగా మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కేజీబీవీ, వీఆర్‌ఎస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచింగ్‌, నాన టీచింగ్‌ స్టాఫ్‌కు సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళనలను చేపడతామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, ఎంఎస్‌టీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శులు గుగులోతు తిరుపతి, గాలిపెల్లి సంతోష్‌, తుమ్మనపెల్లి నరేష్‌, అరవింద్‌, జనార్ధన పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:28 AM