Share News

రైతాంగం సుభిక్షంగా ఉండాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:19 AM

రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రైతాంగం సుభిక్షంగా ఉండాలి

వేములవాడ టౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో కాటిరేవుల(ఎడ్ల) పండుగ కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్‌ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాట్రేవుల పండుగ నిర్వహించడం ఆనవాయి తీగా వస్తుందన్నారు. వ్యవసాయంలో రైతులకు చేదోడువాదోడు గా నిలిచే ఎడ్లను చక్కగా అలంకరించి వాటికి ఎలాంటి అనారో గ్య సమస్యలు రాకుండా చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహించ డం గొప్ప విషయం అన్నారు. మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల ప్రతి రూపాలను తయారుచేసి వాటిని కొలువ డం మంచి పరిణామం అన్నారు. వ్యవసాయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాడిపంటలు సమృద్ధిగా పండి సుఖసంతోషాల తో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మెన్‌ కనికరపు రాకేశ్‌, మహాలక్ష్మి రైతు సంఘం అధ్యక్షులు తోట రాజు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు శ్రీని వాస్‌గౌడ్‌, నాయకులు చిలుక రమేశ్‌, కొండ శేఖర్‌, పులి రాంబాబు, రైతులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట..

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ అర్బన్‌ మండల పరిధిలో అర్హు లైన 30మంది లబ్దిదారులకు రూ.8.91లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను విప్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పేదప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంద న్నారు. పేదలకు వైద్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అర్బన్‌ మండల అధ్యక్షు లు కనుకయ్య, నాయకులు ఎర్రం ఆగయ్య, కత్తి కనుకయ్య, గాలిపల్లి స్వామి, ప్రభాకర్‌రెడ్డి, ఎర్రం రాజు, వంకాయల భూమయ్య తదిత రులు పాల్గొన్నారు.

వెంకన్న సన్నిధిలో ప్రభుత్వ విప్‌ పూజలు

వేములవాడ అర్బన్‌ మండలంలోని అగ్రహారం గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గోదాదేవి కళ్యాణమహోత్సవంలో భాగంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పం పిణీ చేశారు. దేవాలయం వ్యవస్థాపకులు నార్ల రాజేశం పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 02:19 AM