Share News

అంబేద్కర్‌ చూపిన మార్గం దేశానికి ఆదర్శం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:57 AM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చూపిస మార్గం దేశానికి ఆదర్శమని ఎస్సీ, ఎస్టీ, వికలాం గుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

అంబేద్కర్‌ చూపిన మార్గం దేశానికి ఆదర్శం
అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

-మంత్రి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చూపిస మార్గం దేశానికి ఆదర్శమని ఎస్సీ, ఎస్టీ, వికలాం గుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ధర్మపురి మండలంలోని జైనా గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులతో కలిసి పూల మాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సభలో మం త్రి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం విద్య ద్వారా సాధికారత కోసం ఆయ న చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. యువత అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని అసమానతలను దూరం చేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జగి త్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంగనభట్ల దినేష్‌, జైనా, కొసునూర్‌ పల్లె సర్పంచులు గడ్డి లక్ష్మి, ఎన్నం రమాదేవి, ఏఎం సీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, దళిత సంఘాల రాష్ట్ర కార్యదర్శి పారుపెల్లి రాజ మల్లయ్య, అంబేడ్కర్‌ సంఘం మండల అధ్యక్షులు అరికిల్ల సతీష్‌, కమిటీ అధ్యక్షులు కట్ట లక్ష్మణ్‌, బుగ్గారం మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్‌, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, జైనా పీఏసీఎస్‌ చైర్మ న్‌ సౌళ్ల నరేష్‌, సర్పంచ్‌ దాసరి పురుషోత్తం పాల్గొన్నారు.

ఫ ధర్మపురి మండలంలోని కొసునూర్‌పల్లె గ్రా మంలో ఎన్నం సుజాత-మల్లారెడ్డి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం చేకూ రేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Updated Date - Jul 05 , 2026 | 12:57 AM