Share News

రాజీ మార్గమే రాజమార్గం..

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:39 PM

రాజీ మార్గమే రాజమార్గమని, కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పీ నీరజ అన్నారు.

రాజీ మార్గమే రాజమార్గం..

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : రాజీ మార్గమే రాజమార్గమని, కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పీ నీరజ అన్నారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో మంగళవారం సిరిసిల్ల, వేములవాడ బార్‌ అసోసి యేషన్‌ న్యాయవాదులతో సమన్వయ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్క రించడంతో ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారన్నారు. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, లోక్‌అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కారానికి పంపేం దుకు సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి. పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జీ లక్ష్మణాచారి, జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన, సిరిసిల్ల, వేములవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అవునూరి రామాకాంత్‌రావు, పిట్టల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:39 PM