Share News

పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:10 AM

భారతీయ జనతా పార్టీ సిద్థాంతాలతో పాటు లక్ష్యాలు, కార్యాచరణ లను ప్రతి కార్యకర్త క్షుణంగా అవగాహన చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతకుమా ర్‌ కోరారు.

పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : భారతీయ జనతా పార్టీ సిద్థాంతాలతో పాటు లక్ష్యాలు, కార్యాచరణ లను ప్రతి కార్యకర్త క్షుణంగా అవగాహన చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతకుమా ర్‌ కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌-2026లో భాగంగా జిల్లా స్థాయి శిక్ష ణ శిబిరం రెండో రోజు గురువారం సమారోప కార్యక్ర మాన్ని ఘనంగా జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతకు మార్‌ మాట్లాడారు. పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగానే బీజేపీ పని చేస్తోందని, సమాజంలోని చివరి వ్యక్తికి అభి వృద్ధి ఫలాలు చేరేలా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావ, సేవా దృక్పథంతో పనిచేస్తూ పార్టీ విజయాలకు బాటలు వేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగ త నిర్మాణం, సేవా కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించామని తెలిపారు. శిక్షణలో పొందిన అంశాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ చెన్నమనేని వికాసరావు, జిల్లా ఇన్‌చార్జీ గంగాడి మోహన్‌రెడ్డి, నాయకులు ఎర్రం మహేష్‌, లింగంపల్లి శంకర్‌, అల్లాడి రమేష్‌, ముస్తాబాద్‌ సర్పంచ్‌ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నా ల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్‌, కరెడ్ల మధుకర్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ కోకన్వీనర్‌ ఆడెపు రవీందర్‌, దశ రథంరెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి చంటి మహేష్‌, రాష్ట్ర పదాధికారులు, జిల్లా, మండల అధ్యక్షులు, మోర్చా ల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:10 AM