పార్టీని బలోపేతం చేయాలి
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:11 AM
క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయి ని మల్లేశం సూచించారు.
ఇల్లంతకుంట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి) : క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయి ని మల్లేశం సూచించారు. మండలంలోని దాచారం, గాలిపెల్లి గ్రామాల్లో ఆది వారం టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు జరిగాయి. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచాలనే లక్ష్యంతో టిఫిన్ బైఠక్ సమావేశా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయన్నారు. కార్యకర్తలు లబ్ధిదారుల వద్దకు వెళ్లి మరింత అవగాహన కల్పించాలన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు మార్ త్వరలో నిర్వహించే యువకుల ర్యాలీని విజయవంతం చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు భూమల్ల అనీల్‌కుమార్, నాయకులు కొలనూరి ముత్తక్క, నాగసముద్రాల సంతోష్, మంత్రి అరుణ్, మారవేని దివ్యరాజు, సుదగోని శ్రీకాంత్, పొన్నం కృష్ణలతో పాటు వివిధ గ్రా మాల నాయకులు పాల్గొన్నారు.