గ్రామగ్రామాన పార్టీని మరింత బలోపేతం చేయాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:42 PM
గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం కే కన్వెన్షన్‌లో కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్య క్షుడు సూర దేవరాజు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయం జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు నియామక ఉత్త ర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 12 మం డలాలు, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల అధ్యక్షులు పార్టీ పటిష్టతకు కృషి చే యాలన్నారు. గ్రామ గ్రామాన, వార్డుల వారిగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లాలో సర్ ప్రక్రియ దాదాపు 80 శాతం మాత్రమే పూర్తి అయిందన్నారు. ప్రతి బూత్‌లో కూడా ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పా టుచేస్తూ ప్రతి బూత్‌కు కాంగ్రెస్ పార్టీ నుండి సూపర్‌వైజర్లను పెట్టడం జరిగిం దన్నారు. సర్ ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యుద్ధంగా తీసుకో వాలన్నారు. ఈనెల 20 నుంచి 30 వరకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు బాద్యతగా సర్ ప్రక్రియను పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘలా నాయకులు పాల్గొన్నారు.