Share News

ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:47 PM

జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియలో వేగం పెంచి గడువులో ముంగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియలో వేగం పెంచి గడువులో ముంగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరా బాద్‌ నుంచి ఎస్‌ఐఅర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించి జిల్లాలో ఎస్‌ఐఆర్‌ డిజిటలై జేషన్‌ ప్రక్రియ ప్రగతిని అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రి యలో వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో వేగ వంతం చేయాలని ఆదేశించారు. వారం లోగా ప్రక్రియను 90శాతానికి తీసుకరా వాలన్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ఎన్యూమరేషన్‌ ఫారంలో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయడం కేవలం ఐచ్చికం మాత్రమే అని తప్పనిసరి కాదని వివరించారు. కలెక్టర్‌లు ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

జిల్లాలో 80శాతం పూర్తి

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ 80 శాతం పూర్తయ్యాందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ఈ ఆర్‌వోలు, ఏఈఅర్‌వోలు తమ పరిధిలో పర్యవేక్షణ చే యాలని, రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమా వేశాలను నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రా ల రేషనలైజేషన్‌ ప్రక్రియ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అద నపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, తహసీల్దార్‌లు మహేష్‌కుమార్‌రావు, జయంత్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:47 PM