ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:25 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగంపెంచి నిత్యం అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగంపెంచి నిత్యం అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఇందిర్మ ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్, ఎంపీ డీవోలు, తహసీల్దార్‌లు, ఏఈలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా సమీ క్షించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 7367 ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేశామని వెల్లడించారు. వీటిలో 5798 ఇళ్లకు ముగ్గు పోశా మని, 5014 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉండగా 4362 ఇళ్లు గోడల స్థాయిలోకి రాగా, 4012 ఇళ్లు స్లాబ్ దశలో ఉండగా, ఇప్పటి వరకు 2834 ఇళ్లు పూర్తి అయ్యాయని వెల్లడించారు. ముగ్గు పోసిన వారికి ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్‌కు, తుది దశ పనులు పూర్తిచేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్విని యోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులల్లో వేగంగా పెంచి పూర్తి చేసేలా అధికారులు చూడాలని అదేశించారు. ప్రతి మండలంలో ఎంపీడీఓ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించాలని, గ్రామ పం చాయతీ కార్యదర్శులతో నిత్యం సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. మండలానికి కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి ఇళ్లను నిర్మాణాలను చేయిం చాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా ఆయా శాఖల అధికా రులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదే శించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారి వివరాలు లబ్ధిదారులకు అందుబాటులో పెట్టి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో గ్రామీణ ఉపాధిహామీ పనులు వినియోగిం చుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించిందని దానిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఎంపీడీవోలను ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇళ్ల ఫోటోలు ఎప్పటికప్పు డు హౌసింగ్ ఏఈలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు లు జమ అవుతున్నాయని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణాల కు ఎక్కడా ఇసుక కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనా రాయణ, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, ఎంపీడీవో లు, తహసీల్దార్‌లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.