Share News

విచ్ఛిన్నకరమైన విధానాలతో ప్రతిపక్షం..

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:35 AM

ప్రతిపక్షాలు బాధ్యతగల రీతిలో ప్రవర్తించ కుండా విచ్ఛిన్నకరమైన విధా నాలతో ముందుకు పోతున్నా యని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

విచ్ఛిన్నకరమైన విధానాలతో ప్రతిపక్షం..

సిరిసిల్ల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాలు బాధ్యతగల రీతిలో ప్రవర్తించ కుండా విచ్ఛిన్నకరమైన విధా నాలతో ముందుకు పోతున్నా యని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరమణా రావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనా రాయణ, మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కె మహేం దర్‌రెడ్డిలతో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. అనం తరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య మంత్రి నాయకత్వంలో 33 నెలలుగా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తోందని, రైతాంగం, కార్మికులు, విద్యార్థుల సంక్షేమం మౌలిక సదుపాయా ల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రాన్ని అన్ని దిశలా అభివృద్ధి చేసే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినా, వర్షా లు పడకపోయినా సంతోషపడే వాతావరణం ఉందని అన్నారు. తమ ప్రభుత్వం సానుకూలంగా, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో పనిచేస్తుందని తెలి పారు. ఎల్‌నినో వల్ల కరువు ఏర్పడుతున్న తరుణంలో, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తేవాల్సిన సమయం లో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శిం చారు. ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగించేలా సిరిసి ల్ల వేదిక నుంచే ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారని అన్నారు. ఆర్థికభారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం శ్రమి స్తూ ముందుకు ముందుకు వెళుతుందని, ఒక్క రూ పాయి చార్జీలు, విద్యుత్‌ చార్జీలు లేదా ఇతర పన్నుల భారం ప్రజలపై వేయలేదన్నారు. ఎల్‌నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితుల్లో అందరూ కలిసి రాష్ట్రానికి నిధులు రావాల్సిన విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు దేవరాజు, టౌన్‌క్లబ్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, గడ్డం నర్సయ్య, యెల్లే లక్ష్మీనారాయణ, బాలరాజు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:35 AM