Share News

ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:12 AM

జిల్లాలో నిర్ధేశించిన ఆయిల్‌పామ్‌సాగు లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధి కారులను ఆదేశించారు.

ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నిర్ధేశించిన ఆయిల్‌పామ్‌సాగు లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గురువారం రాత్రి ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంపై ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులతో పాటు ఫ్రీ-యూనిక్‌ కంపెనీ, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీ క్షించారు. 2026-27ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్షేత్రస్థా యిలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వారంవారం లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ సాగువల్ల రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీల పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు లకు అవసరమైన సాంకేతిక సహకారం సకాలంలో అందేలా ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా, డ్రిప్‌ ఏర్పాటు, మొక్కల సరఫరా ప్రక్రియల్లో జాప్యం లేకుండా సంబంధిత కంపెనీ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి ఆర్‌.శరత్‌బాబు, జిల్లా వ్యవసా య అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:12 AM