కొలువుదీరిన వనదేవతలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:28 AM
వనదేవతలు కొలువుదీరారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపై కొలువుదీరింది. దీంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్ కల్చరల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వనదేవతలు కొలువుదీరారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపై కొలువుదీరింది. దీంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన పూజారులు పూజ చేసి కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని డప్పుల చప్పుళ్ల మధ్య, పూనకాల మధ్య తీసుకవచ్చి గద్దెపై ప్రతిష్టించారు.మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో..ఎదుర్కోళ్లతో స్వాగతం పలికారు. శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జనం మొక్కులను సమర్పించనున్నారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. గత సంవత్సరం ఉమ్మడి జిల్లాలో జరిగిన జాతరల్లో 13 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ యేడు దాదాపు 15 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశాలున్నాయని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన జాతర జరిగే మేడారంతోపాటు మిగతా ప్రాంతాలకు మరో 35 లక్షల మంది వెళ్లే అవకాశాలు ఉన్నాయి.