Share News

ఎన్టీఏను రద్దు చేయాలి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:06 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను రద్దు చేయాల్సిందేనని సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్‌ వీరయ్య అన్నారు.

ఎన్టీఏను రద్దు చేయాలి..

గణేష్‌నగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను రద్దు చేయాల్సిందేనని సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్‌ వీరయ్య అన్నారు. నగరంలోని బస్టాండ్‌ నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే తీవ్ర ఉద్యమాలతో బీజేపీకి గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సుంకరి సంపత్‌, కాంపెల్లి అరవింద్‌, శ్రీను, ఇషాక్‌, రాకేష్‌, అక్షయ్‌, సంతోష్‌, శివకుమార్‌, అరవింద్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:06 AM