తొమ్మిదో ప్యాకేజీని పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:47 AM
సిరిసిల్ల నియోజకవర్గానికి తలమానికంగా ఉన్న ఎగువ మానేరు తొమ్మిదవ పాకేజీని పూర్తి చేసి సుమారు లక్ష ఎకరాలకు శాశ్వత సాగు నీరు అందించాలంటూ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశామని మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం తెలిపారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల నియోజకవర్గానికి తలమానికంగా ఉన్న ఎగువ మానేరు తొమ్మిదవ పాకేజీని పూర్తి చేసి సుమారు లక్ష ఎకరాలకు శాశ్వత సాగు నీరు అందించాలంటూ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశామని మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం తెలిపారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఎగువ మానేరు ప్రాజెక్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణహిత-చేవేళ్ల ప్రాజె క్టులో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత సీఎం వైఎస్ ఆర్ ఈప్రాంతానికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన 9వ ప్యాకేజీ పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగకపోవడంతో సిరిసిల్ల ప్రాంతం రైతులు సాగు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే సుమారు లక్ష ఎకరాల సాగు భూమికి శాశ్వతంగా నీటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుం దని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎగువ మానేరు ప్రాజెక్టును పరిశీలించి 9వ ప్యాకేజీ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు నాయుకులు పాల్గొన్నారు.