Share News

జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలి

ABN , Publish Date - May 28 , 2026 | 11:48 PM

కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 అమలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి ఎం రఘుశంకర్‌రెడ్డి అన్నారు.

జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలి

సిరిసిల్ల టౌన్‌, మే 28 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 అమలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి ఎం రఘుశంకర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక గీతానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ(టీఎస్‌ఈసీ) జిల్లా అధ్య క్షుడు దుమాల రామనాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి రఘశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యా రంగానికి 20శాతం నిధులు కేటాయించాలని పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. విద్య ను కేంద్రీకరించే విధంగా నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రే టెడ్‌ పాఠశాలల నిర్మాణాలను నిలిపివేయాలని ప్రస్తుత గురుకు లాలు ఉన్న ప్రాంతాలలోనే నిర్వహించాలని అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫారసు మేరకు నిర్మించాలనుకున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు కూడా మానుకోవాలని ప్రస్తుతం ఉన్న పాఠశాలలలోనే సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం అందరూ కలసి ప్రభుత్వ విద్యా రంగా న్ని కాపాడుకోవాలని వాటిని పరిరక్షించుకోవడానికి బాధ్యతగా ముందుకు రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబి స్తున్న అపసవ్య విధానాల వలన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం రోజురోజుకు నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల ను ప్రోత్సహిస్తు ప్రభుత్వ విద్యా ఉనికిని, భవిష్యత్తును ప్రశ్నార ్థకం చేస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమి టీ ఆధ్వర్యంలో జూన్‌ 5న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న ధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరు పతి, గౌరవ అధ్యక్షుడు ఏ రాజేశ్వరావు, టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి అంజయ్య, టీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అవురం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర అడిట్‌ కమిటీ సభ్యులు బూర సదానందం దొంతుల శ్రీహరి, మైలారం తిరుపతి, టీ సురేష్‌, పర్షరాములు, శ్రీనివాస్‌ రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 11:48 PM