Share News

కేసీఆర్‌ దీక్షను తెలియజేయడానికే సభ

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:29 AM

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరణ నిరాహార దీక్ష స్పూర్తిని నేటి తరానికి తెలయజేయడానికే దీక్షా దివస్‌ స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

కేసీఆర్‌ దీక్షను తెలియజేయడానికే సభ

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరణ నిరాహార దీక్ష స్పూర్తిని నేటి తరానికి తెలయజేయడానికే దీక్షా దివస్‌ స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్‌ స్ఫూర్తి బహిరంగ సభకు ఆదివా రం జిల్లానుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అను బంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెల్లారు. ముందుగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లికి, అంబేద్కర్‌, నేతన్న విగ్రహానికి బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాఫ్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్స న్‌ జిందం కళాచక్రపాణి, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక పాతబస్టాండ్‌ లోని అమరవీరుల స్తూపానికి పూలతో నాయకులు ఘన నివాళులర్పించారు. నేతన్న విగ్రహం వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి తోట ఆగయ్య, నాయ కులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మా ట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నవంబరు 29న కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు వచ్చాయని, తెలంగాణను సాధించుకోగలిగినామన్నారు. కేసీఆర్‌ చేపట్టిన అమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్‌ స్ఫూర్తి సభను కరీంనగర్‌లో నిర్వహించుకుంటున్నామన్నారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా నుంచి దాదాపు 25వేల మందితో సభకు వెళ్తున్నామన్నారు. సభకు ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ హాజరవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి జెండా ఊపి కరీంనగర్‌కు తరలివెళ్లే బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, నాయకుడు బొల్లి రామ్మోహన్‌, కుంభాల మల్లారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2026 | 12:29 AM