బలహీనవర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:22 AM
పేద, బలహీన వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పేద, బలహీన వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళలకు ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నంబర్ పత్రాలను మంత్రి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక భద్రతతోపాటు వారి గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళా స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత సరఫరా, ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా క్షేత్ర స్థాయిలో అధికారులు భాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేం దుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని 142 మహిళా సంఘాలకు రూ 48,42,796 వడ్డీ లేని రుణాల పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ మామిళ్ల శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ ఏరుకొండ శ్రీనివాస్, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన జక్కు రవీందర్, టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్, మున్సిపల్ మేనేజర్ బాలె గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన ఇందారపు రామయ్య, జగిత్యాల జిల్లా వక్ఫ్‌బోర్డు మెంబర్ షబ్బీర్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వెల్గటూర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తూ ముందుకు సాగుతోందని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ముత్తునూర్ ముక్తేశ్వర స్వామి గోదావరి లిఫ్ట్‌ను మంత్రి గురువారం పునః ప్రారంభించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న లిఫ్ట్‌కు సంబంఽధించిన ట్రాన్సఫార్మర్ కాపర్‌ను కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనితో లిఫ్ట్ పనిచేయకుండా నిలిచిపోయింది. విషయాన్ని స్థానిక నేతల ద్వారా ,రైతులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అడ్లూరి రాష్ట్ర ఇరిగేషన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి లిఫ్టును పునరుద్ధరించారు. గోదావరి నదిపై ఆధారపడిన ముత్తునూర్‌తో పాటు ఆరేపల్లి, జైన రాజారాం, మండపేట, రాయపట్నం, తిమ్మాపూర్ తదితర గ్రామాల రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా లిఫ్ట్‌ల నిర్వహణకు కాంట్రాక్టర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, తక్షణ మరమ్మతులు చేపడతామని తెలిపారు. ఇటీవల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో దొంగతనాల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి మోటార్లు, ట్రాన్సఫార్మర్లు, విద్యుత పరికరాలను కాపాడుకోవాలని సూచించారు. కరెంట్ ఆన ఆఫ్ సమస్యల వల్ల మోటార్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, విద్యుత శాఖ అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకటప్రసాద్, సర్పంచ కుశనపల్లి లక్ష్మి, ఏఎంసీ చైర్మన గుండాటి గోపిక జితేంధర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శైలేంధర్‌రెడ్డి,