మహిళా శక్తి భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:54 AM
జిల్లా మహిళా శక్తి భవన ఆవరణలో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ గరి మ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా మహిళా శక్తి భవన ఆవరణలో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ గరి మ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ శివారులో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవనాన్ని మంగలవారం అధికా రులతో కలిసి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. నిర్మిస్తున్న భవనం బయట, లోపల వివిధ కార్యాలయాలు, డార్మిటరీ, కిచెన్, మీటింగ్ హాల్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవన ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, తహసీ ల్దార్ మహేష్‌కుమార్‌రావు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, డీఈ వాణి తదితరులు పాల్గొన్నారు.