Share News

రైతుల సమక్షంలో భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:19 AM

భూముల రీసర్వే రైతుల సమక్షంలో చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు.

రైతుల సమక్షంలో భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టాలి

వేములవాడ రూరల్‌, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వే రైతుల సమక్షంలో చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు. వేములవాడ రూరల్‌ మండలం జయవ రంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రి యను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ శనివారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్‌ యంత్రాలు, డిజిటల్‌ పరికరాల ద్వారా సర్వే చేస్తుండగా, పరిశీలించి. సూచనలు చేశారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జీపీఓలు, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు భూముల రీ సర్వేపై గ్రామంలో రైతులకు ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. భూముల రీ సర్వేపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల సమక్షంలో భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. వారి భూముల వివరాలు తెలియజేసి సంతకాలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, రెవె న్యూ, సర్వే శాఖ అధికారులు సమన్వయంతో సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:19 AM