భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:47 AM
జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారుల ను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం భూముల రీసర్వే ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు తదితర అంశాలపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్‌లతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీ క్షించారు. దీనిలో భాగంగా జిల్లాలో భూముల రీ సర్వేపై కలెక్టర్ ఆరా తీశారు. రుద్రంగి మండల కేంద్రం, వీర్నపల్లి మండలం గర్జనపల్లి, గంభీరా వుపేట మండలం ఖుర్దు లింగంపల్లి, కోనరావు పేట మండలం మర్తనపేట, సిరిసిల్ల అర్బన్‌లో ని పెద్దూరు, చందుర్తి మండలం ఎన్గల్, వేము లవాడ అర్బన్ మండలం తెట్టెకుంట, తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి, వేణుగోపాలపూర్, వేము లవాడ రూరల్ మండలం రుద్రవరం, ముస్తా బాద్ మండలం గూడూరు, మొర్రాపూర్, బోయి నపల్లి మండలం వర్దవెల్లి, కొదురుపాక, ఇల్లంత కుంట మండలం జవారిపేట, ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో భూముల రీసర్వే కొన సాగుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసు కవచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్ర వాల్ మాట్లాడుతూ గ్రామాల సరిహద్దు సర్వే సర్వే అండ్‌ల్యాండ్‌రికార్డ్స్ రెవెన్యూ, అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సం యుక్తంగా చేపట్టాలని, భూము లకు సంబంధించిన సమాచా రం పక్కాగా సేకరించి, నమో దు చేయాలని ఆదేశించారు. సంబంధిత జిల్లా అధికారి, డీఐలు, తహసీల్దార్లు భూముల రీసర్వే చేపడుతున్న గ్రామాల లో పర్యటించి, ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూ చించారు. భూములకు సంబం ధించిన సమాచారం తప్పులు లేకుండా, పకడ్బం దీగా సేకరించాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారుల సేవ లు వినియోగించుకోవాలన్నారు. భూభారతి దర ఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.సమా వేశంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్లు, డీఐ లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.