Share News

భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:27 AM

జిల్లాలో చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు.

భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
నిమ్మనపల్లి వద్ద సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్‌ , జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. బుధవారం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు.

అనంతరం పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, మండల పరిషత ప్రాథమిక పాఠశాలను ఆకస్మి కంగా తనిఖీ చేసి విద్యాబోధన, ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భూ రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబర్‌ను వరుస క్రమంలో కచ్చి తంగా నమోదు చేయా లని, రికార్డులు పక్కా గా నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి లో పూర్తిస్థాయి పరిశీలన నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శ కంగా భూ రీ సర్వే పూర్తి చేయాలని అధికారు లకు సూచించారు. అనంతరం నిట్టూరు గ్రా మంలోని పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎఫ్‌ఎల్‌ఎన కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి ప్రాథ మిక విద్యానైపుణ్యాలు తప్పనిసరిగా అందేలా ఉపా ధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన కల్పించాలని, విద్యా ప్రణా ళిక ప్రకారం సిలబస్‌ను పూర్తిచేయాలని ఆదే శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉం డేలా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతీ విద్యార్థి చదవగలిగే స్థాయికి చేరుకునేలా కృషి చే యాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందిం చాలని సూచించారు. పాఠశాల ఆవరణను పరి శుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లలో ఎల్ల ప్పుడూ నీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పర్యటనలో ఏడీ సర్వే సోమేశ్వర్‌, జడ్పీహెచఎస్‌ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ఎంపీపీఎస్‌ ప్రధానోపాధ్యాయు రాలు రాజమణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:27 AM