Share News

భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:14 AM

జిల్లాలో భూముల రీ సర్వేలను ప్రణాళిక ప్రకారం చేపట్టి లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అదేశించారు.

భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూముల రీ సర్వేలను ప్రణాళిక ప్రకారం చేపట్టి లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అదేశించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ నుంచి భూముల రీసర్వే, భూభారతి అమలు, సాధాబైనామా దర ఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల, డబుల్‌ బెడ్‌రూంల పంపిణీ, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించి భూముల రీసర్వే పురోగతిపై ప్రజల నుంచి వస్తున్న స్పందనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చా మని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధరణి కాలంలో పెండింగ్‌లో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించామని తెలిపారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి నిబంధనల మేరకు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూముల రీ సర్వేలు తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం శిక్షణ పొందిన లైసెన్స్‌ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్‌ సర్వేయర్లు, లైసెన్స్‌ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్స్‌ సర్వేయర్లకు ఉద్యోగం రెగ్యులరైజేషన్‌ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. భూముల రీ సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి 2027 నాటికి మూడు విడతల్లో భూ రీ- సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ సర్వేలో పనిచేసే లైసెన్స్‌ సర్వేయర్లకు ఎకరానికి రూ. 50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్వే విధులకు ముందుకు రాని లైసెన్స్‌ సర్వేయర్లకు సమాచారం చేరవేసి.. ముందుకు రాని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధ నల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు అనంతరం నిధు లు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని అదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్య త ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండో విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు. ఇసుక, మట్టి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారు లను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడు తూ జిల్లాలో భూముల రీసర్వే షెడ్యూల్‌ ప్రకారం సర్వే నిర్వహించాల ని సంబంధిత అదికారులను ఆదేశించారు. దానికి కావలసిన యంత్రా లు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశార ు. సంబంధిత గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించాలని ఆదేశించారు. నక్ష సర్వే గడువులోగా పూర్తి చేయాలని, దాని సిబ్బందిని సైతం భూముల రీ సర్వే లో వినియోగించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్‌ బాబు, సర్వే ఏడీ శ్రీనివాస్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:14 AM