Share News

భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:01 AM

జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రి యను రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవా ల్‌ ఆదేశించారు.

భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేయాలి

సిరిసిల్ల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రి యను రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవా ల్‌ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలో సోమవారం భూముల రీసర్వే ప్రక్రియ, భూ భారతి, సాదా బైనామా, ఎస్‌ఐఆర్‌, 22ఏ తదితర అంశాలపై అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మండలాల వారిగా భూముల రీ-సర్వే ప్రక్రియ, వివిధ అంశాలపై తహసీల్దార్లు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూముల రీ-సర్వేలో భాగంగా భూ ముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించాలని, లక్ష్యం నిర్దేశిం చుకుని, రీ-సర్వే గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్వే చేసే ముందు ఆయా భూముల సర్వే నంబర్ల వివరాల సమా చారం చేరవేయాలని తెలిపారు. గ్రామ సరిహద్దుల రీ-సర్వే, ఇతర పనులను తహసీల్దారు క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలించాలని సూచిం చారు. గ్రామ సరిహద్దుల రీ-సర్వే చేసేప్పుడు రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అటవీ శాఖ అధికారులు పాల్గొనేలా చూడాలని ఆదేశిం చారు. ప్రతి తహసీల్దార్‌ భూముల రీసర్వే, భూ భారతి, సాదాబైనా మా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పనులను పకడ్బందీగా చేయించాలని ఆదేశిం చారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్‌ బాబు, కేఎస్‌ బీ కుమారి, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

సిరిసిల్ల అర్బన్‌ : జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావా ల్సిన భూసేకరణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవా రం సాయంత్రం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ సచివాల యం నుంచి రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్‌తో కలిసి ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు రైల్వేలైన్‌లకు భూసేకరణపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. జిల్లాలో రైల్వేలైన్‌ల నిర్మాణా నికి విస్తరణ, ఎప్పటివరకు పూర్తి చేస్తారు, రైల్వే స్టేషన్‌ల నిర్మాణాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు మాట్లాడుతూ జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు అవ సరమైన భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేసి భూములను అప్పగిం చాలని ఆదేశించారు. ఈ వీడియోకాన్పరేన్స్‌లో జిల్లా అటవీ శాఖ అధి కారి సత్యనారాయణ, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారీ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 01:02 AM