భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:15 AM
భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణం తిప్పాపురంలోని రాజరాజశ్వరస్వా మి గోశాలలో మంగళవారం రైతులకు అందజేసిన కోడెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం లో కోడెల మొక్కును భక్తులు స్వామివారికి చెల్లిస్తార న్నారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా కోడెల సంరక్ష ణకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ చేస్తున్నామని, కోడెల పంపిణీ పారదర్శ కంగా జరుగుతుందన్నారు. కోడెలను పక్కదారి పట్టించి వ్యవసాయ పనుల నిమిత్తం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేములవాడ పరిధిలో అధు నాతన సౌకర్యాలతో సవిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే గోశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. 150కోట్ల రూపాయలతో వేములవాడ రాజరాజే శ్వరస్వామి దేవస్థాన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయ న్నారు. అనంతరం కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ అర్హులైన రైతులకు మాత్రమే కోడెలను అందజేయబడుతాయన్నారు. రైతులు ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాతనే కోడెలు అందజేయబడుతాయన్నారు. కోడెలను తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ రాకేష్, ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఇన్‌చార్జి ఈవో అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, తదిత రులు పాల్గొన్నారు.