Share News

కమీషన్లకు చెక్‌ పెట్టేందుకే జీ రామ్‌ జీ చట్టం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:33 AM

జాతీయ ఉపాధి హామీ పథ కంలో కమీషన్‌లకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వీబీజీరాంజీ చట్టాన్ని తీసుకరావడంతో చట్టంపై కాంగ్రెస్‌ నాయకులు విషం కక్కుతున్నారని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశా రు.

కమీషన్లకు చెక్‌ పెట్టేందుకే జీ రామ్‌ జీ చట్టం

సిరిసిల్ల అర్బన్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథ కంలో కమీషన్‌లకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వీబీజీరాంజీ చట్టాన్ని తీసుకరావడంతో చట్టంపై కాంగ్రెస్‌ నాయకులు విషం కక్కుతున్నారని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశా రు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన ఉపాఽధిహామీ నూతన చట్టంపై నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనర్సయ్య మాట్లాడారు. డిజిటల్‌ హాజరు, జియో ట్యాగింగ్‌తో కూలీల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే చేరు తోందని మధ్యలో నొక్కేయడానికి వీల్లేకపోవడంతోనే కాంగ్రెస్‌ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దివాలా కోరు రాజకీయాలు చేస్తోందని అరోపించారు. కూలీల కు పనిదినాలను 125 రోజులకు పెంచడమే కాకుండా, పని కల్పించలేక పోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన కూలీలకు వరప్రదాయినిగా ఉందన్నారు. 80 శాతం అదనపు బడ్జెట్‌తో గ్రామాల రూపురేఖలు మార్చేం దుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, గ్రామాల్లో గిడ్డంగులు, రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణంతోపాటు గ్రామాలు వికసించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రఫేల్‌ నుంచి రామమందిరం వరకు.. దేశానికి ఏ మంచి జరిగినా అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్న ఇండియ న్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, నేడు ప్రజల దృష్టిలో యాంటీ నేషనల్‌ కాంగ్రెస్‌గా ముద్ర పడిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ పని దినాల్లో 60 రోజుల పాటు పనులకు విరామం కల్పించడంతో అటు కూలీలకు అదనంగా వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం కలగడంతో పాటు రైతులకు కూలీల లభ్యత పెరుగుతుందన్నారు. ఉపాధి పనులు చేపట్టే పని ప్రదేశాల్లోనే వీబీజీరాంజీ చట్టం గొప్పతనాన్ని కూలీలకు వివరించి, కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో వివిధ వర్గాల ప్రజలతో ఈ చట్టంపై సభలు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్‌, మట్ట వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బిజెపి కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి పల్లి గోపాల్‌ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం వెంకట లక్ష్మి అన్నాడి జలపతి రెడ్డి, అన్నిమండలాల బీజేపీ అధ్యక్షులు, కిసా న్‌మో ర్చా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:33 AM