జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:33 AM
అసెంబ్లీ ఎన్ని కల సమయంలో కాం గ్రెస్ పార్టీ గ్రామపంచా యతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమ లు చేయాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్ని కల సమయంలో కాం గ్రెస్ పార్టీ గ్రామపంచా యతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమ లు చేయాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. అలాగే వారి సమస్య లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి కనీస వేతనం రూ.26వేలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొ న్నారు. సీఐటీయూ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధ వారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జీపీ కార్మికు లు ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పును కల్పించి జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చూడాలం టూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఎండనక, వాననక, చలనక అహర్ని శలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికు లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అందించి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రతి ఒకటవ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జీతాలను జమ చేయాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలన్నారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు, పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నా రని అన్నారు. బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని, స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసినా సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు, కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగ మంటి ఎల్లారెడ్డి, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బూర శ్రీనివాస్, సీఐ టీయూ జిల్లా కోశాధికారి అన్నల్‌దాస్ గణేష్, యూని యన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్, కంసాని రవీందర్, నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్, అనిల్, కాంతయ్య, లక్ష్మీ, పద్మలతో పాటు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.