Share News

మాజీ సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:42 AM

శాసన సభ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మాజీ సర్పంచ్‌ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మాజీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల్కర్‌ శ్రీనివాస్‌ అన్నా రు.

మాజీ సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : శాసన సభ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మాజీ సర్పంచ్‌ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మాజీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల్కర్‌ శ్రీనివాస్‌ అన్నా రు. శనివారం జిల్లా కేంద్రం ప్రెస్‌క్లబ్‌లో సంక్షేమ సంఘం సమావేశంలో మేనిఫెస్టోల్‌ ఇచ్చిన హామీలకు సంబంధించిన కరపత్రంతో తెలంగాణ మాజీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. 2023 శాసన సభ ఎన్నికల సమయంలో మాజీ సర్పంచ్‌లకు గౌరవ పెన్షన్‌ వర్తింప జేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సర్పంచ్‌లు అందరు కాంగ్రెస్‌ పార్టీకి మద్ద తుగా ప్రచారం చేసి గెలిపించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో కాం గ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న మాజీ సర్పం చ్‌లకు ఇచ్చిన హామీల పట్ల ఊసెత్తడం లేదని ఆరోపించారు. గౌరవ పెన్షన్‌ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు. మంత్రులు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు మాజీ సర్పంచ్‌లకు గౌరవ పెన్షన్‌ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బొడ్డు దేవయ్య, ఏరెడ్డి మల్లారెడ్డి, నాలుక సత్యం, సంపునూరి మల్లేశంగౌడ్‌, గుర్రం భూపతి, ఏరెల్లి నారాయణ, గంగాధర్‌, రాంచంద్రం, రాములునా యక్‌, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:42 AM