Share News

భూ భారతి సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:25 AM

భూ భారతి, సాదాబైనామా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. చొప్పదండి తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

భూ భారతి సమస్యలను పరిష్కరించాలి
చొప్పదండి తహసిల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

చొప్పదండి, జూన 9 (ఆంధ్రజ్యోతి): భూ భారతి, సాదాబైనామా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. చొప్పదండి తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాదాబైనామా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సీసీఎల్‌ఏ మార్గదర్శకాల మేరకు సాదాబైనామా దరఖాస్తులు, రికార్డులు, పత్రాలను పరిశీలించి అర్హత ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, తహసిల్దార్‌ నవీనకుమార్‌, మోబిన పాల్గొన్నారు.

  • పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

గంగాధర: రైతుల భూసమస్యలపై వచ్చిన పెండింగ్‌ ధరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం గంగాధర తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి.. సాదా బైనామాల అమలు విధానాన్ని తహసీల్దార్‌ రజితను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ అంబటి రజిత ఉన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:25 AM