ఆరంభంలోనే ఆర్భాటం నామమాత్రంగా బడిబాట..
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:39 AM
ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నామమా త్రంగానే నిర్వహిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నామమా త్రంగానే నిర్వహిస్తున్నారు. ఆరంభంలో ఆర్భా టం ప్రదర్శించే ఉపాధ్యాయులు ఆ తర్వాత రోజు హాజరు కాకుండా వంతుల వారీగా హాజ రవుతుండడంతో కార్యక్రమం ఉద్ధేశం నీరుగారి పోతున్నది. ఈ నెల 3వ తేదీ నుంచి ఆరం భమైన బడిబాట కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుంది. బడీడు పిల్లలు ఇంటా, బయట ఉండకుండా పాఠశా లల్లో చేర్పించడంతోపాటు డ్రాపవుట్స్ లేకుండా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్ర మం నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ కొంత బడ్జెట్‌ను కూడా కేటాయిస్తుంది. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా భ్యాసం చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపా ధ్యాయులు ప్రభుత్వం రూపొందించిన కార్యాచ రణ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 583 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా విద్యార్థులు 31,804 మంది ఉన్నారు. ఇందులో 15,085 మంది బాలురు, 16,719 మంది బాలి కలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ సంఖ్యలో 10 శాతానికి పైగా విద్యార్థుల నమోదును పెంచాల్సి ఉంటుంది.
ఫ ప్రధాన లక్ష్యాలు..
ప్రతీ నివాస ప్రాంతంలో పాఠశాల వయస్సు గల పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు, తల్లితండ్రులు, గ్రామ పెద్ద లు, స్వశక్తి సంఘాల మహిళలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పిల్లల ను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. గ్రామ విద్యా రిజిష్టర్, అడ్మిషన్ రిజిష్టర్లలో వివరాలను నవీకరించడం, 5వ తరగతి నుంచి 6వ తరగ తికి, 8వ తరగతి నుంచి 9వ తరగతికి విద్యా ర్థులను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. బాలికల నమోదు, నిలుపుదల, పునఃప్రవేశం, ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, పిల్లలను సకాలంలో బడికి పంపించడంలో, వారి చదువుపై దృష్టి పెట్టేం దుకు తల్లితండ్రుల పాత్రను బలోపేతం చేయా ల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల జరిగిన మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ తరగతులు, ఏఐ ఆధారిత అభ్యాసం, ఎఫ్‌ఎల్ ఎన్, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలి.
ఫ రోజు వారీగా షెడ్యూల్..
బడిబాట నిర్వహించేందుకు ముందుగా గత నెల 14న తల్లితండ్రులతో సమావేశాలు, 21వ తేదీన అంగన్‌వాడీ టీచర్లు, తల్లుల కమిటీ సమావేశాలు, 28వ తేదీన యువత, స్థానిక నాయకులతో సమావేశాలను నామమాత్రంగానే నిర్వహించారు. ఈ నెల 3వ తేదీన గ్రామసభలు నిర్వహించడం, 4న అవగాహన ర్యాలీ, 5వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు, 6న బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడం, 8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గురించి వివరించాలి. ప్రధానంగా ఉచిత విద్యతోపాటు అల్పాహారం, మధ్యాహ్నా భోజనం, రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, ఈ విద్యా సంవత్సరం నుంచి 21 వస్తువులు గల కిట్ల గురించి తల్లితండ్రులకు వివరించాలి. 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానుండడం తో విద్యార్థులకు స్వాగతం పలకడం, అదే రోజు తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. 15వ తేదీన సామూహిక అక్షర భ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎన్ డే నిర్వహించడం, 17న బాలికల విద్య గురించి, 18వ తేదీన డిజి టల్ తరగతుల గురించి విద్యార్థులకు అవగా హన కల్పించాలి. 19వ తేదీన విద్యార్థులకు ఆటలు ఆడించాలి. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10 శాతమైనా విద్యార్థుల నమోదును పెంచాలని లక్ష్యంగా విధించారు. బడి బాట కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేసి, అత్యధిక నమోదు సాధించిన మూడు జిల్లాలను, 10 పాఠశాలలను ప్రత్యేకంగా సత్కరిస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. యేటా పకడ్బందీగా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందిస్తున్నప్పటికీ, అమలు చేయడంలో విఫలం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో కంటే మౌలిక వసతులు పెరుగుతున్నా కూడా విద్యార్థుల తల్లితండ్రులకు ప్రభుత్వ పాఠ శాలలపై విశ్వాసం కల్పించలేక పోతున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఇప్పటికే రెండు రోజులు ముగిసింది. జనాభా లెక్కల్లో ఉన్న ఉపాధ్యాయులు మినహా ప్రతీ ఉపాధ్యాయుడు బడిబాటను పకడ్బందీగా నిర్వహిస్తేనే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది.