సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలి
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:12 AM
వీపీవోలు గ్రామాల్లో పర్యటిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.
వేములవాడ రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి) : వీపీవోలు గ్రామాల్లో పర్యటిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. వేములవాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ నేరాల నియంత్రణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ మరింత సమర్థవం తంగా అమలు చేయాలన్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వ ర్తించాలన్నారు. కేసుల విచారణలో త్వరితగతిన దర్యాప్తు చేపట్టాల న్నారు. సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలన్నారు. అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడే వారిపై నిఘా ఉంచాలన్నారు.సీసీ కెమరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు.స్టేషన్‌లో అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు. కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, రూ రల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై చల్ల వెంకట్రాజం, సిబ్బంది పాల్గొన్నారు.