Share News

హర్‌ ఘర్‌ తిరంగాను ఊరూరా చేపట్టాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:35 PM

జిల్లావ్యాప్తంగా ఊరూరా హర్‌ ఘర్‌ తిరంగాను చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.

హర్‌ ఘర్‌ తిరంగాను ఊరూరా చేపట్టాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఊరూరా హర్‌ ఘర్‌ తిరంగాను చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో బుధవారం హర్‌ ఘర్‌ తిరంగాపై ప్రత్యేక సమీక్షా సమావేశం కార్యక్రమ కన్వీనర్‌ అసాని రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గోపి మాట్లాడుతూ జిల్లాలో హర్‌ ఘర్‌ తిరంగాను చేపట్టాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురువేసేలా కృషి చేయాలని సూచించారు. ఈనెల 6నుంచి 10వ తేదీవరకు మండల స్థాయిలో సామాజిక, స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రతి ఇంటికి జాతీయ పతకాలను పంపిణీ చేసి ఎగురవేసేలా కృషి చేయా లన్నారు. 11వతేదీ నుంచి 14 వరకు జిల్లాలోని నియోజకవర్గా లతో పాటు అన్ని మండలాల్లో తిరంగా యాత్రలు చేపట్టాలని, జాతీయ జెండాలను బీజేపీ నాయకులు తమ ఇళ్లపై ఎగురవేయాలన్నారు. బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 25ట్రాక్టర్‌లు, ఎడ్లబండ్లతో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ భారీ తిరంగా ర్యాలీలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు లింగంపల్లి శంకర్‌, కరీంనగర్‌ పార్లమెం టరీ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు బండ మల్లేశం, మల్లారపు సంతోష్‌రెడ్డి, బర్కం వెంకటలక్ష్మీ, అధికార ప్రతినిధినవీన్‌యాదవ్‌, మీసం సంజీవ్‌,బుగ్గారెడ్డి, గోప్పాడి సురేందర్‌రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కార్యాలయం ఇన్‌చార్జ్‌ బాగయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ జూకంటి అఖిల్‌, సెన్సార్‌ బోర్డు సభ్యురాలు వేముల వేశాలి, ధార్మిక సెల్‌ కన్వీనర్‌ సత్యనారా యణ, కౌన్సిల్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ సెల్‌ కన్వీనర్‌ తుంగ పవన్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.

Updated Date - Aug 05 , 2026 | 11:35 PM