వైభవంగా దుబ్బ రాజరాజేశ్వరస్వామి కల్యాణం
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:38 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సారంగాపూర్ మండలంలోని పెంబట్ల దుబ్బ రాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం దుబ్బరాజరాజేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
- పట్టు వసా్త్రలు సమర్పించిన కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు
జగిత్యాల అర్బన, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సారంగాపూర్ మండలంలోని పెంబట్ల దుబ్బ రాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం దుబ్బరాజరాజేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని నిర్వహించే కల్యాణోత్సవానికి కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు అమ్మవారికి స్వామివారికి పట్టు వసా్త్రలు తీసుకు వచ్చారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆలయ అర్చకులు స్వామి వారి కల్యాణోత్సవాన్ని అశేష భక్త జనం తిలకించిగా కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆలయ కార్యనిర్వాహణాధికారి వడ్లూరి అనూష, ఆలయ ఫౌండర్ ట్రస్టీ పొరండ్ల శంకరయ్య, తహసీల్దార్ వహీద్, ఎంపీడీ వో సలీం తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శివపార్వతుల కల్యాణం
జగిత్యాల టౌన, ఫిబ్రవరి(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్‌నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శివపార్వతుల విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బ్రతిగుళ్ల విష్ణుశర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం కన్నులు పండువగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులతో ఊరేగింపు నిర్వహించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొత్త మోహన, గుడి కందుల శ్రీనివాస్, ముసిపట్ల లక్ష్మినారయణ, భోనగిరి శ్రీనివాస్, కృష్ణరెడ్డి, కొత్తపల్లి శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, నూనే రాధకిషన, రాములు, ఇతర కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.