Share News

వైభవంగా మల్లన్న జాతర

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:06 AM

కథలాపూర్‌ మండలంలోని తాండ్ర్యాలలో ఆదివారం మల్లన్న జాతర వైభవోపేతంగా సాగింది.

వైభవంగా మల్లన్న జాతర
తాండ్ర్యాలలో బోనాలతో వెళ్తున్న గ్రామస్థులు

కథలాపూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కథలాపూర్‌ మండలంలోని తాండ్ర్యాలలో ఆదివారం మల్లన్న జాతర వైభవోపేతంగా సాగింది. గ్రామ శివారుల్లో ఉన్న మల్లన్న గుట్టపైకి ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మల్లన్న కల్యాణం సాంప్రాదాయ రీతిలో అర్చకులు కన్నుల పండవగా నిర్వహించగా చుట్టు పక్కన గ్రామాల నుంచి వచ్చిన జనాలు వీక్షించారు. ఇంటికొకరు చొప్పున మల్లన్న స్వామికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా కొనసాగింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ జాతరకు హాజరు కాగా అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విప్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జంగ శివానిరంజిత్‌, ఆచార సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 01:06 AM